చిత్రం చెప్పే విశేషాలు

(07- 11- 2024)

ప్రముఖ సినీనటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మధురా నగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలో పర్యటించిన నారా బ్రాహ్మణి శివపురం వద్ద సొంత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన నేపథ్యంలో నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్‌ రాగులు, కొర్రలు, తదితర చిరుధాన్యాలతో చిత్రపటాన్ని తయారుచేశారు.

హైదరాబాద్‌లోని హబ్సిగూడలో వైబ్స్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ను నటి తేజస్వి మదివాడ, ఎండీ లలిత జైన్‌తో కలిసి బుధవారం లాంచ్‌ చేశారు.

ఈ నెల 8న తెలంగాణా సీఎం రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు..ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ..ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో సైతిక శిల్పం తీర్చిదిద్దారు.

అమలాపురంలోని భూపయ్య అగ్రహారానికి చెందిన పుత్సా కృష్ణకామేశ్వర్‌ అరుదైన నాణేలు సేకరిస్తుంటారు. అగ్రదేశం అమెరికా అధ్యక్షుల చిత్రాలతో ముద్రించిన డాలర్‌ నాణేలు ఆయన వద్ద ఉన్నాయి.

మర్రిచెట్టు మధ్యలో నుంచి నిటారుగా పెరిగిన ఓ తాటి చెట్టు వృక్ష నేస్తంలా మారి ఇలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడు వద్ద ఓ రైతు పొలంలో కనిపించిన దృశ్యమిది.  

నీటితో నిండుగా ఉన్న కోనేరు.. ఆ మధ్యలో శివలింగం.. పక్కనే జపం చేస్తున్నట్లు నిల్చున్న ఓ కొంగ. చీమకుర్తి మండలం రామతీర్ధం కోనేరు వద్ద కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది.  

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home