చిత్రం చెప్పేవిశేషాలు

(08-11-2024)

హైదరాబాద్‌ నగరంలో గురువారం వేడుకగా ఛఠ్‌ పూజలు జరిగాయి. ఖాజాగూడ మల్కంచెరువు, ట్యాంక్‌బండ్‌ వద్ద మహిళలు సూర్య నమస్కారం చేశారు. వివిధ రకాల పూలు, పండ్లతో దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించారు.

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఎస్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్‌ నిర్వహించారు.

బిహార్‌ రాజధాని పట్నాలో గురువారం ఛఠ్‌ పూజ పండగ సందర్భంగా గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు. 

రావి ఆకుపై సీఎం రేవంత్‌ చిత్రం గీసి శుభాకాంక్షలు తెలిపిన మెదక్‌ జిల్లా మనోహరా బాద్‌కు చెందిన చిత్రలేఖన ఉపాధ్యాయుడు.

ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

‘అమరన్‌’తో విజయం అందుకున్న రాజ్‌కుమార్‌ పెరియసామి ధనుష్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు.

గుబురుగా పెరిగిన చెట్ల మధ్యలో సుమారు మూడున్నర అడుగుల పసరపాము తొండని వేటాడి నోటకరిచి చెట్ల కొమ్మల్లోకి తీసుకెళ్లింది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home