చిత్రం చెప్పేవిశేషాలు

(09-11-2024)

హైలైఫ్‌ పేరిట హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను మిస్‌ ఇండియా వరల్డ్‌ 2024 విజేత నిఖిత ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. 

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి. మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖ్‌, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ ఛైర్మన్‌ పవన్‌ ఖేడా, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డిలతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి.

విశాఖ తీరం దీపకాంతుల హారమైంది. అలల తరంగాలకు ఓంకార నాదాలు తోడై వేదమంత్రాలు ధ్వనించాయి. ‘ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌’ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో శుక్రవారం రాత్రి కార్తిక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు ఇందులో ప్రయాణించారు.

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ మహారథం ట్రయల్‌ రన్‌ శుక్రవారం జరిగింది. ఆలయంలో కార్తిక మహాదీపోత్సవాలు డిసెంబరులో జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా రథోత్సవం 10న నిర్వహించనున్నారు. 

శనివారం  కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సినీ హీరో నిఖిల్‌.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం, ఊరేగింపు

అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home