చిత్రం చెప్పేవిశేషాలు
(11-11-2024)
కృష్ణా నదీ తీరం దీపకాంతులతో మెరిసిపోయింది.‘ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ’ ఆధ్వర్యంలో విజయవాడలోని వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో ఆదివారం రాత్రి కార్తిక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.
నేడు భారత సుప్రీం కోర్టు నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై ఎస్మా కింద చర్యలు తీసుకోవాలని తెలిపారు.
భద్రాచలం గోదావరి నదిలో దీపాలను వదులుతున్న భక్తులు.
భారీ టవర్‌పై విద్యుత్తు దీపం వెలుగులు విరజిమ్ముతున్నట్లు భానుడు ప్రత్యక్షమైన ఈ దృశ్యమిది.
ఓ పిల్ల వానరం తల్లి వద్ద పాలు తాగిన అనంతరం.. ఒడిలో వెచ్చగా సేదతీరుతున్న దృశ్యమిది.
కార్తికమాసం రెండో సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.