చిత్రం చెప్పేవిశేషాలు

(12-11-2024)

టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌- డాక్టర్‌ ప్రీతి చల్లా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం వీరి వివాహం ఇరు కుటుంబాలు, కొద్దిమంది అథితులు మధ్య జరిగింది.

సూర్య నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కంగువా’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పలు నగరాల్లో ప్రమోషన్స్‌లో సూర్య స్టైలిష్‌గా కనిపించారు.

పూజ చేయాలంటే..ఏ పూలు తేవాలో తెలియదు నాకు. అభిషేకం చేయాలంటే..అదీ తెలియదు. నీవే అర్థం చేసుకుని అనుగ్రహించాలి శివయ్య అన్నట్లు.. కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. 

మంచు మనోజ్, నారా రోహిత్‌, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తోన్న చిత్రం ‘భైరవం’. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ ఫస్ట్‌ లుక్‌ను టీం విడుదల చేసింది.

వరంగల్ లక్ష్మీపురం మోడల్ కూరగాయల మార్కెట్‌ను మంగళవారం రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా సందర్శించారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో నెలకొన్న సమస్యలపై ఆమె ఆరా తీశారు.

పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్టలో ఏకాదశి సందర్భంగా మంగళవారం వైష్ణవాచారంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు.

తిరుమల శ్రీవారిని సినీనటుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

ఈ ఏడాది మిస్‌ టీన్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత్‌కు చెందిన తృష్ణా రే దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ పోటీలు జరిగాయి.

చిత్రం చెప్పేవిశేషాలు(02-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(01-01-2025)

Eenadu.net Home