చిత్రం చెప్పేవిశేషాలు
(13-11-2024)
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించిన భాజపా నాయకుడు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న‘మట్కా’మూవీ టీమ్ వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి తీగల.
నటుడు రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా ఒక సరికొత్త కార్యక్రమం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
తిరుమల గిరులు.. ‘హిమ’గిరులుగా మారాయి. తెల్లని, చల్లని మంచు పలకరింపులతో భక్తులు పులకరిస్తున్నారు.
కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకొని దిల్లీలో తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం ఆ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన జిప్‌లైన్‌లో ప్రయాణిస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో అర్చకులు ద్వాదశి పూజలు నిర్వహించారు. బుధవారం ద్వాదశి పురస్కరించుకొని పంచామృతాభిషేకం నిర్వహించారు.