చిత్రం చెప్పేవిశేషాలు

(14-11-2024)

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీరవిశంకర్ 

మంగళగిరి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.  

భక్తులు వెలిగించిన దీపాల వెలుగులో కొమురవెల్లి మల్లికార్జునస్వామి వెలుగులీనుతున్నాడు. 

దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుట్టిన రోజును పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఘనంగా ‘బాలల దినోత్సవం’ నిర్వహించారు. పలు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.

తిరుమల శ్రీవారిని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ‘ఆప్‌’ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. 

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.

శ్రీవారికి తితిదే మాజీ ఛైర్మన్‌, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను తితిదే (TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు చేతులమీదుగా అందజేశారు.

నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’తాజాగా టీజర్‌ విడుదలైంది. డిసెంబరు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ పారిశ్రామికవేత్త, వైకాపా ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home