చిత్రం చెప్పేవిశేషాలు

(15-11-2024)

కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.

విజయవాడ పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుని, మహిళలు నదిలో తెప్పలు వదిలారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా యాదాద్రిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. 

సిద్దిపేటలోని సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో కార్డియాక్‌ సెంటర్‌ను మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రారంభించారు. గురువారం ఆయన ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు.

జన్నారం మండలం కవ్వాల్‌ అభయారణ్యంలో ఈ సౌకర్యం ఉండగా జిల్లా కేంద్రంలోనూ మరొకటి అందుబాటులోకి రానుంది.సఫారీ ప్రాంతాలను డ్రోన్‌ కెమెరా సహాయంతో తీసిన చిత్రం. 

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఘనంగా ఆయుధ పూజ హాజరైన తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి  

సీతంపేట బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిపారు. బాలల దినోత్సవం అక్షరాల ఆకారంలో బాలికలు కూర్చుని ఆకట్టుకున్నారు. 

తిరుమల శ్రీవారికి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విరాళం 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించిన హైదరాబాద్‌కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సి.వెంకట నాగరాజు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home