చిత్రం చెప్పేవిశేషాలు
(16-11-1024)
కొబ్బరి ఆకులతో సనత్‌నగర్ మల్లికార్జున స్వామి.
శ్రీకాకుళం నగరంలోని కాలభైరవాలయంలో కోటి వత్తుల దీపోత్సవం.
జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణిలో శుక్రవారం రాత్రి పంచ సహస్ర కార్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు పూజలు నిర్వహించి పంచ సహస్ర దీపోత్సవాన్ని నిర్వహించారు.
గుంటూరులోని వీవీఐటీ ఆధ్వర్యంలో శుక్రవారం బాలోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.
విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అని కొనియాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు.
కర్ణాటకలోని పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు కర్ణాటక చరిత్రాత్మక డ్రైవ్-2024 పేరిట వింటేజ్, క్లాసిక్ కార్ల యజమానులు ముందుకు వచ్చారు.
రామోజీరావు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. నిత్య స్ఫూర్తిగా నిలిచే ఆయన జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
గాయనీగాయకులు రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
బాపట్ల అష్టలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి గాజుల అలంకరణ.