చిత్రం చెప్పేవిశేషాలు
(18-11-2024)
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
అబుజాలో భారత సంతతి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ.
కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది.
నయనతార పుట్టినరోజు నాడు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ‘రక్కయీ’అనే కొత్త సినిమాను ప్రకటించారు. సెంథిల్ దర్శకత్వంలో ఈ చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కనుంది. ఈ వివరాలు తెలుపుతూ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు.
జూబ్లీహిల్స్‌లోని సోమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను సినీనటి సిమ్రన్ చౌదరి ప్రారంభించారు. పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
హైలైఫ్ పేరిట హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్యాషన్ కార్యక్రమం జరగనుంది. ఇది ఈ నెల 22,23, 24 తేదీల్లో జరగనుందని నిర్వాహకులు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు.
నెలలు నిండకముందే పుట్టే శిశువుల పట్ల అవగాహన పెంచడం కోసం కొండాపూర్ కిమ్స్ క్రెడల్స్లో ‘ప్రీమెచ్యూరిటీ డే వాక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సాయికుమార్, ఆది ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.