చిత్రం చెప్పేవిశేషాలు

(23-11-2024)

హైదరాబాద్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి ప్రారంభించారు. 

నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలు’కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అరకులోయ పర్యాటకులకు మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ అందాలు అలరిస్తున్నాయి. సూర్యోదయాన ఇక్కడి అందాలను తిలకించి సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు చలి వణికిస్తున్నా పర్యాటకులు తరలివస్తున్నారు.  

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.

బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ బాలోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రకాల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.

అక్కినేని నాగచైతన్య తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్య కొత్త సినిమాను ప్రకటించారు. ‘#NC24’ పేరుతో ఇది రూపొందుతుంది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీకి విజయం కట్టబెట్టిన వయనాడ్ ప్రజలు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో భాజపా అభ్యర్థి నవ్య హరిదాస్‌పై మెజార్టీ సాధించారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home