చిత్రం చెప్పేవిశేషాలు

(25-11-2024)

గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టును టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

శిల్పారామంలో ఆదివారం ‘లోక్‌ మంథన్‌’ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, కిషన్‌ రెడ్డి, గజేంద్ర షెకావత్‌, కళాకారులు హాజరయ్యారు.

మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల వార్షికోత్సవం ఆదివారం ప్రజ్వల్‌ పేరుతో కనులపండుగగా సాగింది. విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నానక్‌రాంగూడలోని ఏడీపీ ఇండియా సంస్థ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘బ్రింగ్‌ యువర్‌ కిడ్స్‌ టు వర్క్‌’ పేరుతో ఆదివారం తమ ఉద్యోగుల పిల్లలకు వినోద వస్తువులు ఏర్పాటు చేయగా చిన్నారులు ఉత్సాహంగా ఆడుకున్నారు.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప2’లో కిస్సిక్‌ సాంగ్‌ రికార్డు సృష్టించింది దక్షిణాదిలో అత్యధికమంది వీక్షించిన పాటగా ఈ సాంగ్ నిలిచింది.

హైదరాబాద్‌ కెనైన్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘పెట్‌షో’ జరిగింది. పెంపుడు శునకాలు, పిల్లులతో జంతు ప్రేమికులు తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పీఎం సూర్యఘర్‌, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్‌ విద్యుత్‌ పరికరాల ఏర్పాటుపై చర్చించారు.

ఐపీఎల్‌ వేలంలో కళ్లు చెదిరే ధరలతో రికార్డులు బద్ధలయ్యాయి. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. 

కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home