చిత్రం చెప్పేవిశేషాలు

(26-11-2025)

మంచుదుప్పటి కప్పినట్లు ఆవరించిన మంచు సోయగం.. సూర్యోదయాన్ని చూస్తూ విచ్చుకునే కలువ పూలు.

గత కొన్నిరోజులుగా చలి తీవ్రత పెరగడంతో గ్రామాల్లో మంచు సోయగాలు ఇలా ఆకట్టుకుంటున్నాయి.

రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారం నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్రచిత్రకారుడు, రాజ్యాంగ చిత్రం, జాతీయ చిహ్నాలను మలిచి దేశప్రజలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

వయనాడ్‌ ఎంపీగా గెలుపొందిన ప్రియాంక గాంధీని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రియాంక గాంధీని కలిసి అభినందనలు తెలిపారు.

కూడళ్లు, పైవంతెనలకు వేసిన చిత్రాలు నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. ఎల్బీనగర్‌ చౌరస్తాలోని పైవంతెన పిల్లర్‌కు వేసిన నాట్య కళాకారిణి చిత్రాన్ని చూసిన ఓ యువతి ఆ భంగిమను అనుకరిస్తూ సందడి చేసింది. 

దిల్లీలో పర్యటిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిసారు. పర్యాటకానికి సంబంధించి కొన్ని అంశాలను ఆయనతో చర్చించినట్లు తెలిపారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని.. ఇవాళ పవిత్ర, విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home