చిత్రం చెప్పేవిశేషాలు

(25-11-2024)

కరీంనగర్‌లోని తితిదే కల్యాణ మండపంలో మంగళవారం వైభవంగా కార్తిక దీపోత్సవం నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలు హాజరై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

కార్తిక దీపోత్సవం సందర్భంగా మహిళలు, యువతులు కరీంనగర్‌లోని తితిదే కల్యాణ మండపంలో దీపాలు వెలిగించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సీఆర్‌ పాటిల్‌, నాయకులతో పవన్‌ సమావేశమయ్యారు.

తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నటి కీర్తి సురేశ్‌ అధికారిక ప్రకటన చేశారు. ఆంటోనీతో దిగిన ఫొటోని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. జలజీవన్‌ మిషన్‌ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు. 

శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. తితిదే అధికారులు జ్యోతికకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రముఖ నటుడు సుబ్బరాజువివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను పంచుకున్నారు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home