చిత్రం చెప్పేవిశేషాలు

(28-11-2024)

విజయవాడ సత్యనారాయణపురం కొమ్ము వారి వీధి శిశు విద్యా మందిర ప్రాంగణంలో కార్తిక దీపోత్సవంలో శివలింగాకారంలో భక్తులు దీపాలు వెలిగించారు.

నాచారంలో ఏర్పాటు చేసిన ఓ మార్కెట్‌ను నటుడు బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో మాట్లాడి సందడి చేశారు.

నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్‌తో పాటు నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు.

కార్తికమాసం సందర్భంగా పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో లక్షదీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

తిరుచానూరులో కనుల విందుగా విద్యుత్తు దీపాలంకరణ.

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె.. గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.

నితిన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల కథానాయిక. డిసెంబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 

‘వికటకవి’తో తొలిసారి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు మేఘా ఆకాశ్‌. జీ5 వేదికగా ఇది అందుబాటులో ఉంది. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home