చిత్రం చెప్పే విశేషాలు

(01-12-2024/1)

విశాఖ బీచ్‌ తీరంలో ‘వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘సంధ్య మెరైన్స్‌ వైజాగ్‌ మారథాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. నగరవాసులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. 

తెలంగాణ మంత్రి సీతక్క శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మాస శివరాత్రి సందర్భంగా కడప జిల్లా వల్లూరు మండలంలోని పురాతన ఆలయం పుష్పగిరి క్షేత్రం నదిలో భక్తుడు రాఘవేంద్ర వర్మ సైకత శివలింగం తయారు చేశారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 

కార్తిక అమవాస్య సందర్భంగా యాదాద్రికి భక్తులు పోటెత్తారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 

తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఫెయింజల్‌ తుపాను కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో పొగమంచు ఇలా దట్టంగా కమ్మేసింది. 

భారత నౌకదళం ఆధ్వర్యంలో ఒడిశాలోని పూరీ తీరంలో డిసెంబర్ 4న నేవీ డే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పూరీ తీరంలో రిహార్సల్స్ నిర్వహించారు. 

చిత్రం చెప్పే విశేషాలు(05-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

Eenadu.net Home