చిత్రం చెప్పేవిశేషాలు

(03-12-20240

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్‌ యోజన గిరిజిన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

కోణార్క్‌ నృత్యోత్సవాల్లో భాగంగా చంద్రభాగ తీరంలో సైకత శిల్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.

పార్వతీసమేత కుండలేశ్వరుడు కొలువై ఉన్న కుండలేశ్వరంలో వృద్ధగౌతమి గోదావరి నదీ ఒడ్డున అఖండ గోదావరి హారతిని సోమవారం రాత్రి నిర్వహించారు. 

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా విద్యుత్తు దీపాలతో అలంకరించిన మెదక్‌ కలెక్టరేట్‌.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లోని కొండ ప్రాంతాల్లో రాక్‌ థ్రష్‌ అనే పక్షి సంచరిస్తోంది.

అక్కయ్యపాలెంలోని సాయిబాబా ఆలయంలో కొణతాల రేవతిరావు అనే భక్తుడు 14 కేజీల మరమరాలతో శివలింగం, రుబ్బురోలు, సన్నికల్లు రూపొందించారు.

సోమవారం హైదరాబాద్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో ‘వైల్డ్‌ఫైర్‌ జాతర’పేరుతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్ర బృందం. ఈవెంట్‌ సినీతారలు సందడి చేశారు. 

కొండగట్టు అంజన్నను దర్శించున్న సినీ హీరో వరుణ్ తేజ్.

ఒలింపిక్‌ పతకాల విజేత ఛాంపియన్‌ పి.వి. సింధు పెళ్లి కూతురు కాబోతోంది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని ఆమె ఈ నెల 22న వివాహమాడనుంది.

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home