చిత్రం చెప్పేవిశేషాలు
(05-12-2024)
2024 సెప్టెంబర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల లిస్ట్‌ను ప్రకటించింది ఐఎమ్‌డీబీ. ఈ లిస్ట్‌లో టాప్ వన్‌లో త్రిప్తి డిమ్రీ రెండులో నటి దీపికా పదుకొణె నిలిచారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ‘‘రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం’’. అని ఆయన అన్నారు.
మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మంత్రాలయం తరఫున అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షల విరాళాన్ని ఏపీ సీఎం చంద్రబాబును కలసి అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
పాడేరు ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి మేఘాల కొండ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది.
ఆస్వాదించే మనసుండాలే కానీ.. కనిపించే ఎన్నో దృశ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కనుచూపు మేర పచ్చటి పొలాలతో కనువిందు చేసే ప్రాంతంలో.. మోడు వారిన ఓ చెట్టు ప్రకృతి గీసిన చిత్రంలా చూపరులను ఆకట్టుకుంటుంది.
నెక్లెస్ రోడ్‌లో చెట్లకు విద్యుద్దీపాలు.. ముస్తాబవుతున్న ఇందిరాగాంధీ విగ్రహం.
సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
నావికాదళ వేడుకల (నేవీడే)ను పురస్కరించుకుని బుధవారం పూరీ తీరంలో ప్రముఖ శిల్పి మానస్‌కుమార్ సాహు సైకత శిల్పం తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు.