చిత్రం చెప్పే విశేషాలు

(08-12-2024/1)

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల దర్శన వరుసలు, పూజా మండపాలు కోలాహలం నింపుకున్నాయి.

ఆదివారం ‘వి- రన్ ఫర్ తిరుపతి’ కార్యక్రమం నిర్వహించారు. 10కే, 5కే, 3కే రన్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో యువత ఉత్సాహంగా ఉరకలేసింది. 

గచ్చిబౌలిలో జాతీయ ఫైన్‌ స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించారు. సుమారు 250 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జయరామ్‌ తనయుడు, నటుడు కాళిదాస్‌ మోడల్‌ తరిణిని పెళ్లి చేసుకున్నారు. కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం వీరి వివాహం జరిగింది. 

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. ఆలయ పరిసరాలు, సప్త గోపురాలు, మాడ వీధుల్లో మంచు అందాలు భక్తులను కనువిందు చేశాయి. 

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ వద్ద ఎయిర్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. 

బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీ 2024లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. పెర్త్‌ టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home