చిత్రం చెప్పే విశేషాలు
(15-12-2024)
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఆదివారం ఉదయం 9వ ఎడిషన్ నేవీ మారథాన్ నిర్వహించారు. సుమారు 12 వేల మంది నావికులు, నేవి విభాగాల ఉద్యోగులు, విశాఖ నగర వాసులు పాల్గొన్నారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ పేరుతో 2కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణలో ఆదివారం గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులతో సందడి వాతావరణం నెలకొంది.
గచ్చిబౌలి లెమన్‌ట్రీ పక్కన టీఎస్‌ఐఐసీ వద్ద ఆదివారం హెచ్‌సీఎల్ సైక్లథాన్ నిర్వహించారు. నగరంలోని యువత, మహిళలు, భారీగా పాల్గొన్నారు. 52, 23, 10 కిలోమీటర్లు సైకిలింగ్ నిర్వహించారు.
జయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తన మామయ్య, నటుడు చిరంజీవిని అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు.