చిత్రం చెప్పే విశేషాలు

(22-12-2024)

క్రిస్మస్‌ సందర్భంగా చెన్నైలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం వందల సంఖ్యలో ప్రజలు సాంటాక్లాజ్‌ వేషధారణలో ర్యాలీ తీశారు. అనంతరం వేడుకలు చేసుకున్నారు.

క్రిస్మస్‌ సందర్భంగా ‘మెదక్‌ క్యాథెడ్రల్‌ చర్చి’ శతాబ్ది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

క్రిస్మస్‌ సమీపిస్తున్న తరుణంలో వివిధ దేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. పలు నగరాలు విద్యుత్‌ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలమనేరులో మంచినీటి వాటర్‌ ప్లాంట్‌ను పునఃప్రారంభించారు. సంబంధిత ఫొటోలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్‌ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’తో సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఈ అవార్డును మోదీకి అందజేశారు.

దసరా ఫేం దీక్షిత్‌ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(21-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home