చిత్రం చెప్పేవిశేషాలు

(06-12-2024)

సినీ నటి మీనాక్షి చౌదరి శుక్రవారం కడపలో సందడి చేశారు. కడప ద్వారకానగర్‌లో ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.

అమెరికాలోని న్యూయార్క్‌ రాక్‌ఫిల్లర్‌ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన 74 అడుగుల ఎత్తైన, 11 టన్నుల క్రిస్మస్‌ ట్రీ అందరినీ ఆకర్షిస్తోంది. 

విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో శుక్రవారం ‘ఉమెన్స్‌ ఈక్వాలిటీ’ పేరుతో 1కే వాన్‌ నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. మన్మథరావు జెండా ఊపి వాక్‌ను ప్రారంభించారు.

విజయవాడలో పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం 62వ హోం గార్డ్స్‌ రైజింగ్‌ డే వేడుకలు నిర్వహించారు. పోలీసులు, సిబ్బంది పరేడ్‌ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌ కాంక్లేవ్‌కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. నాలెడ్జ్‌ హబ్‌గా ఏపీ తయారవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు.

రామ్‌ పోతినేని హీరోగా మహేశ్‌ దర్శకత్వంలో రానున్న చిత్రం Rapo22 మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఈ సినిమాలో రామ్‌ సాగర్‌గా కనిపించనున్నారు.

చిత్రం చెప్పేవిశేషాలు(26-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చెప్పిన సూక్తులు (శతజయంతి)

Eenadu.net Home