చిత్రం చెప్పేవిశేషాలు
(07-12-2024)
‘కలర్ ఫొటో’దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల వేదికగా నేడు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో సుహాస్, వైవా హర్ష తదితరులు హాజరై సందడి చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ 7అడుగుల వెడల్పు, 70అడుగుల పొడవు, 2254 కిలోల బరువున్న అతిపెద్ద ‘రష్యన్ మెడోవిక్ హనీ కేక్‌ను తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కు స్వాగతం పలుకుతున్న భాజపా నాయకులు.
విశాలంగా కనిపిస్తున్న ఈ బాహుబలి వంతెన కొత్తగా ఆధునికీకరిస్తున్న చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ రైల్వేస్టేషన్‌లో నిర్మించిన రెండు పాదచారలు వంతెనల్లో ఒకటి.
కడప మున్సిపల్ హైస్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
క్రీడల ప్రారంభవేళ వెలిగించిన జ్యోతిలా ఉంది కదూ ఈ చిత్రం చూస్తుంటే.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాజ్యోతిలా వెలుగులీనుతూ దర్పం ప్రదర్శిస్తున్న సూరీడి చిత్రం ఇది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సుహాస్ దంపతులు.
భారత వాయుసేనకు చెందిన జెట్ విమానాలు దూసుకెళ్లనున్నాయి. వాయు సేనకు చెందిన బృందం హుస్సేన్‌సాగర్ తీరంలో 25 నిమిషాల పాటు అబ్బురపరిచే విన్యాసాలతో ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.