చిత్రం చెప్పేవిశేషాలు
(09-12-2024)
ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హుషారెత్తించే పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాల్లో రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాగర్ జలాలపై ఆకట్టుకున్న ఎయిర్‌షో.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ఈ చిత్రంపై డాక్యుమెంటరీని సిద్ధం చేసింది టీమ్.
కేపీహెచ్‌బీ నెక్సాస్ మాల్‌లో ఆదివారం ‘తరుణి దాయన్’ ఫ్యాషన్ షో నిర్వహించారు. మోడల్స్, ఫ్యాషన్ ప్రియులు హాజరై నూతన వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేసి అలరించారు.
విజయవాడ సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో ‘FETE 2024’ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
హస్తకళల్లో తోలుబొమ్మలాట ఒకటి.. ఇది స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. తోలుబొమ్మలపై చిత్రాలు గీస్తున్న కళాకారుడు దళవాయి చలపతిరావు.
పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. మంచు దుప్పటి కప్పి ఉన్న ఈ ప్రాంతంలో ఉదయించే సూర్యుడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.