చిత్రం చెప్పేవిశేషాలు

(16-12-2024)

కీర్తి సురేశ్‌ తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో ఈ నెల 12న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మరోసారి వారి పెళ్లి జరిగింది.

ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో గడ్డ కట్టిన జంగ్‌ జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి. 

పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం.. వస్తూనే విహంగ వీక్షణం చేశారు. పోలవరం గ్యాప్‌1 పనులను పరిశీలించి.. ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. 

హైదరాబాద్‌ శిల్పారామంలో ఆల్‌ ఇండియా క్రాఫ్ట్స్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు హాజరయ్యారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆకట్టుకున్న భారీ క్రిస్మస్‌ చెట్టు.

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్‌ హుస్సేన్‌ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ ఆయనతో కలసి ఉన్న ఫొటోను తన సోషల్‌ మీడియాలో పంచుకుని విడ్కోలు తెలిపారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం శాస్త్రోక్తంగా ధనుర్మాస వేడుకలకు శ్రీకారం చుట్టారు.

డబ్బు కోసం తాను చెస్‌ ఆడట్లేదని.. ఆటపై ప్రేమతోనే ఇందులో కొనసాగుతున్నానని కొత్త ప్రపంచ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ అన్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెస్‌ టైటిల్‌తో పాటు కోట్ల రూపాయిలు బహుమతిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

చిత్రం చెప్పే విశేషాలు(05-02-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-02-2025)

చిత్రం చెప్పే విశేషాలు(04-02-2025)

Eenadu.net Home