చిత్రం చెప్పేవిశేషాలు
(17-12-2024)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమెకు స్వాగతం పలికారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
జాతీయ, అంతర్జాతీయ అంశాలను పార్లమెంట్ లో లేవనెత్తుతున్న ప్రియాంకా గాంధీ.. వాటిని ప్రతిబింబించేలా బ్యాగులు వెంట తీసుకువస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్‌లో కొత్త కొత్త థీమ్‌లతో జరుగుతున్న స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తిగా కొనసాగింది. పార్టీ ప్రియులకు కొత్త ఆలోచనలతో రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఘనంగా ఈవెంట్ నిర్వహించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ‘ఫాలో ఆన్’ను తప్పించుకుంది. టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*), ఆకాశ్ దీప్ (27*) పదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు.
మల్దకల్‌లో జనవాహిని మధ్య సాగుతున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథం.
గోధుమ, లేత ఎరుపు, పసుపు రంగుల్లో నిగనిగలాడే శరీర సౌష్ఠవం, తల వెనుక జడ వేసినట్లు తన అందంతో చూపరులను ఆకర్షించే పక్షి ఇండియన్ పాండ్ హెరాన్.
వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన ఉండాలని అమలాపురం ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ డైరెక్టర్ సోమవారం పాఠశాల విద్యార్థులను సమనస గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి వరిసాగును వివరించారు.
రవీంద్ర భారతిలో అంగీక, సాత్వికాభినయాలు, చక్కటి భావప్రకటనతో యువనర్తకి మేఘన గార్లపాటి కూచిపూడి నృత్యాంశాలు నయన మనోహరంగా ప్రదర్శించి ఆకట్టుకుంది.