చిత్రం చెప్పేవిశేషాలు

(20-12-2024)

ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.

గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని దాల్‌ సరస్సులో అతిశీతల వాతావరణం కారణంగా మంచు గడ్డ కట్టడంతో, గురువారం హిమ ఫలకాలతో ఆడుకుంటున్న పర్యాటకులు. 

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సినీనటుడు అక్కినేని అఖిల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్‌ తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోల్ వెనక లింక్ రోడ్డులో శుక్రవారం 75వ వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు.

హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో ‘రేస్ టు విన్’ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో ‘డెమోక్రటిక్ సంఘ్ ఛేంజ్ మేక‌ర్’అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు.

శిల్పారామంలో కళాకారులు చూడముచ్చటైన కూచిపూడి, భరతనాట్య నృత్యాంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(02-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(01-01-2025)

Eenadu.net Home