చిత్రం చెప్పే విశేషాలు!
(05-12-2022/1)
చిత్రంలోని నారు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి- నాయుడుపేట మార్గంలో జాతీయ రహదారి పక్కన కన్నలి వద్ద ఉన్న నర్సరీలోనిది. మిషన్ నాటుతో చాలా తక్కువ సమయంతోపాటు, కూలీల అవసరం ఉండదు, వరిలో పిలకలూ ఎక్కువ వస్తాయని నర్సరీ నిర్వాహకుడు సురేష్ తెలిపారు.
source:Eenadu
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ముకు విజయవాడ పోరంకిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం నిర్వహించింది. కొందరు ఆహ్వానపత్రాలు తీసుకొని, చంటిపిల్లలతో వచ్చినా పోలీసులు అనుమతించలేదు.
source:Eenadu
కడియం నర్సరీల్లో సన్‌డ్రాప్ ఫ్రూట్ అబ్బురపరుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ఈ మొక్క నుంచి తొలిపంట పండింది. నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు మాట్లాడుతూ మళయాల సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ మొక్కలను ఆయన గార్డెన్‌లో స్వయంగా పెంచుతున్నారని చెప్పారు.
source:Eenadu
తూగో జిల్లా కొవ్వూరు పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్లను నరికి వైకాపా జెండా తరహా రంగులు వేశారు. పురపాలక కమిషనర్ శ్రీకాంత్ వివరణిస్తూ చెట్లు ఏపుగా పెరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని తొలగించాం. గుర్తు తెలియని వ్యక్తులు రంగులు వేశారన్నారు.
source:Eenadu
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డి ఇంట్లో 10 అడుగులకు పైగా పెరిగిన వాము మొక్క ఇది. సాధారణంగా ఈ మొక్క 1 నుంచి 3 అడుగుల వరకు పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన విత్తనం, జన్యులక్షణాలతో మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
source:Eenadu
హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. వివిధ రకాల అలంకరణ సామగ్రితో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు దుకాణదారులు ప్రయత్నిస్తున్నారు. మియాపూర్‌లో హైవేపై ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ వద్ద పలువురు ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
source:Eenadu
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని సెయిన్ నదిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్టాండప్ పాడిల్(చిన్న తెప్ప) పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు
source:Eenadu
అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా విశేష పూజలు చేశారు. ఉదయం ఆలయ ముఖద్వార మండపంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు.
source:Eenadu