చిత్రం చెప్పే విశేషాలు!

(21-11-2022/1)

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి గట్టు ఇటీవల వరదలకు భారీగా కోతకు గురైంది. అప్పటికప్పుడు కర్రలు, ఇసుక బస్తాల సాయంతో తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేశారు. సోమవారం సీఎం పర్యటన నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

source:eenadu

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ నడిబొడ్డున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపించి సమీకృత కూరగాయల మార్కెట్‌, వ్యాపార సముదాయాన్ని రూ.23 కోట్లతో నిర్మించారు. కానీ కాంప్లెక్స్‌ ప్రహరీ పక్కన దుకాణాలను, తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకున్నారు.

source:eenadu

ఇదేదో చెరువు కాదు. జగనన్న లేఅవుట్‌.గతంలో కురిసిన వర్షాలకు ఇప్పటికీ ఈ ప్రాంతంలో నీరు నిల్వ ఉంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో 3 ఎకరాలను మెరక చేయకుండా ఇవ్వడంతో అందులోని మొత్తం 130 ప్లాట్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి.

source:eenadu

కృష్ణా జిల్లా అవనిగడ్డలోని కొండవీటి సందీప్‌ ఆన్‌లైన్‌లో బెంగళూరు నుంచి ఎయిర్‌ పొటాటో విత్తనాలను తెప్పించి నాటారు. మొక్కలు మొలవగా పందిరి వేసి వాటి తీగను పాకించారు. ప్రస్తుతం తీగలకు కాస్తున్న బంగాళా దుంపలు పలువురిని ఆకర్షిస్తున్నాయి.

source:eenadu

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తన వాహనంపై సీపీఎస్, నెప్‌ 2020 రద్దు చేయాలని కోరుతూ పలు డిమాండ్లను రాయించుకున్నారు.

source:eenadu

ఓదెలు అనే రైతు.. చంటిపిల్లాడిని ఒడిలో వేసుకొని లాలిస్తున్న తల్లి ఆకృతిని మిరప చేనులో ఏర్పాటు చేయించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుషాపూర్‌ శివారులోని మిరప పంటలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

source:eenadu

జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యటకులు బారులుదీరారు. సందర్శకులతో జలపాతం పరిసరాలు కిక్కిరిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు, చిన్నలు జలపాతంలో దిగి స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు.

source:eenadu

విశాఖ, అరకు ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అలాంటి వారి కోసమే సరికొత్త గుడారాలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ బీచ్‌ రోడ్డులో జోడుగుళ్లపాలెం నుంచి సాగర్‌నగర్‌కు వెళ్లే దారిలో సముద్రతీరంలో శుక్రవారం వాటి విక్రేతలు నమూనాగా ఉంచారు.

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు!(04-12-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(04-12-2022/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(03-12-2022/2)

Eenadu.net Home