చిత్రం చెప్పే విశేషాలు

(30-03-2023/1)

నెల్లూరు జిల్లాలోని యాచవరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఎ.రాముఆచారి సీతారామాంజనేయ లక్ష్మణ ప్రతిమలను బుధవారం ప్రదర్శించారు. వారంపాటు శ్రమించి కొయ్య ముక్కలతో సుమారు 1.5సెం.మీ. వెడల్పు, 5 సెం.మీ. ఎత్తు ఉన్న ప్రతిమలను చెక్కి పెన్సిల్‌పై అమర్చారు.

Source:Eenadu

హనుమకొండ నగరంలో డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం కూడలి పేరుగాంచింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆధ్వర్యంలో ఆధునికీకరించారు. కొత్త అభివృద్ధి పనులతో అంబేడ్కర్‌ కూడలి జిగేలుమంటోంది. రాణిరుద్రమ దేవి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Source:Eenadu

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతపల్లిలో బుధవారం మధ్యాహ్నం రంగుల హరివిల్లు కనువిందు చేసింది. మధ్నాహ్నం వరకు భానుడి ప్రతాపం కనిపించి తర్వాత వర్షం కురిసింది. అనంతరం బాలాజీపేట సమీపంలోని కొండపై రంగుల హరివిల్లు విరిసింది.

Source:Eenadu

ఇంటర్మీడియెట్‌ జనరల్‌ విభాగం విద్యార్థుల పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షా కేంద్రం బయటకు రాగానే వారు కేరింతలు కొట్టారు. వసతిగృహాల్లో ఉండి చదివిన విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్వస్థలాలకు బయలుదేరారు.

Source:Eenadu

శ్రీరామ నవమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ నగరం సిద్ధమైంది. గురువారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారాముల కల్యాణోత్సవానికి, తరలివచ్చే భక్తజనానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

Source:Eenadu

కాకినాడ సముద్ర తీరం నుంచి సుమారు 20 కి.మీ. దూరంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డు ఆధ్వర్యంలో బుధవారం రీజినల్‌ సెర్చ్, రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌(సారెక్స్‌-2023) నిర్వహించారు. సముద్రంలో విపత్తుల స్పందన, నిర్వహణపై నిర్వహించిన ఈ మాక్‌డ్రిల్‌ అబ్బురపరిచింది.

Source:Eenadu

ఆటపాటలు, ర్యాంప్‌వాక్‌తో విద్యార్థినులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలోని ఒమేగా మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు.

Source:Eenadu

జర్మనీలోని డుసెల్డోర్ఫ్‌లో ఇటీవల నిర్వహించిన ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’లో ‘క్లైన్‌ జొహన్నా’ అనే సైకిల్‌ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. 2,177 కిలోల బరువుతో బుల్డోజర్‌ పరిమాణంలో ఉన్న దీన్ని తుక్కు దుకాణం నుంచి తెచ్చిన వస్తువులతో తయారు చేశారు.

Source:Eenadu

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ముగిశాయి. వీడ్కోలు వేళ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, నారాయణగూడ పరీక్ష కేంద్రాల చెంత విద్యార్థినుల సంబరమిది.

Source:Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home