చిత్రం చెప్పే విశేషాలు
(15-04-2023/1)
తన కుమార్తె కిమ్ జు-ఏతో కలిసి ఘన ఇంధన క్షిపణి ప్రయోగాన్ని తిలకిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్
Source:Eenadu
రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసరాలు కళకళలాడుతున్నాయి. ఓ వైపు ఇఫ్తార్ విందులు, మరోవైపు పండగ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో చారిత్రక కట్టడం చుట్టూ వీధులన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం పరిస్థితి ఇది.
Source:Eenadu
యాదగిరిగుట్ట-వంగపల్లి రహదారిలో గుల్‌మోహర్ పూల అందం బాటసారులను కనువిందు చేస్తోంది. వేసవిలో ఈ చెట్టు ఆకులు పూర్తిగా రాలిపోయినా విరగబూయడం ప్రత్యేకం. కాషాయ వర్ణంలో కనిపించే ఈ పూలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
Source:Eenadu
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం గిరిజాయ్ గ్రామ పంచాయతీ పరిధి ఇంద్రానగర్‌లోని ఓ చేతిపంపునకు గ్రామస్థులు ఇనుప గొలుసుతో తాళం వేస్తున్నారు. 20 ఇళ్లు, 80 మంది జనాభా ఉండగా.. ఎప్పుడుపడితే అప్పుడు నీరు తీసుకెళితే అందరికి సరిపోవని ఇలా చేస్తున్నారని తెలిపారు.
Source:Eenadu
హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలవడంతో.. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
Source:Eenadu
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌లో శుక్రవారం కూలిపోయిన వంతెన. ఈ ప్రమాదంలో బైశాఖీ ఉత్సవాలకు హాజరైన దాదాపు 61 మంది భక్తులు గాయపడగా, 9 ఏళ్ల బాలిక మరణించింది.
Source:Eenadu
వైశాఖీ వేడుకల సందర్భంగా నగర్ కీర్తన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సిక్కు సోదరులు, మహిళలు, చిన్నారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
Source:Eenadu
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలన్న లక్ష్యంతో విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం రావాడ సమీపంలోని గాయత్రీ శక్తి పీఠం వద్ద ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన శిల్పి హేమ్‌చంద్ రూపొందించిన గంగామాత సైకతశిల్పం ఆకట్టుకుంది.
Source:Eenadu
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన 64 ఏళ్ల కొయ్యడ రాములు గీత కార్మికుడు. ప్రమాదంలో ఆయన కాలు విరగగా, కోలుకున్నారు. 45 ఏళ్లుగా కల్లు తీయడమే ఆయన వృత్తి. ఆయన వెదురు బొంగులతో నిచ్చెన తయారు చేయించుకుని కల్లు తీసి అందర్ని అబ్బురపరిచారు.
Source:Eenadu
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ రేవు నుంచి చేపల వేటకెళ్లిన ఓ మత్స్యకారుడి వలకు 9 అడుగుల పొడవున్న చేప చిక్కింది. చూడటానికి పాములా ఉంది. ఇది ఈల్ జాతికి చెందిన చేప. సాధారణంగా ఐదారు అడుగులు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్లో.. అసలే వర్షపు నీటిలో ప్రయాణం.. ఎప్పుడు వాహనం అదుపుతప్పి పడతామో తెలియని పరిస్థితి. ఆపై చరవాణిలో మాట్లాడుతూ వెళ్తున్న యువకుడు
Source:Eenadu