చిత్రం చెప్పే విశేషాలు
(13-11-2023/2)
తుల ఉమ సోమవారం తన అనుచరులతో కలిసి తిరిగి భారాసలో చేరారు. గత హోదాకంటే కూడా మరింత సముచిత హోదాను, బాధ్యతలను ఆమెకు అప్పగించి గౌరవించుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల సందర్భంగా మహాసముంద్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ అంబర్‌పేటలో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్ విజయం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. భాజపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం.. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఈరోజు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. పంజాగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
గాజాలో హమాస్ దళాల తీవ్ర పోరు జరుగుతోంది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
నాగబాబు ఇంట్లో దీపావళి పండగ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండగ వేడుకలకు నూతన దంపతులు వరుణ్ తేజ్-లావణ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.