చిత్రం చెప్పే విశేషాలు

(14-09-2024/1)

వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడులో వినాయకుడిని శనివారం రూ. 11 లక్షల కరెన్సీతో అలంకరించారు. 

కల్యాణ్‌ మార్గ్‌లోని మోదీ నివాసంలోని ఆవుకు లేగదూడ జన్మించింది. దీనికి దీప్‌జ్యోతి అని మోదీ నామరకరణం చేసి మా కుటుంబలోకి కొత్త మెంబర్‌ వచ్చిందని పోస్టు పెట్టారు. 

2006లో విడుదలైన బొమ్మరిల్లు బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడు దీనిని సెప్టెంబర్‌ 21న రీరిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. 

శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు కావడంతో ఖైరతాబాద్‌ వినాయకుడికి భక్తులు పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్‌ మెట్రో కిక్కిరిసిపోయింది. 

యాదాద్రి క్షేత్రంలో శనివారం ఏకాదశి ఆరాధనగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మహాముఖ మండపంలో యజ్ఞ మూర్తులను కొలుస్తూ, లక్ష పుష్పాలతో ఆరాధించారు.

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

సంవత్సరంలో ఏడో సారి బద్దలైన అగ్ని పర్వతం

Eenadu.net Home