చిత్రం చెప్పే విశేషాలు

(16-09-2024/1)

 నటుడు సిద్ధార్థ్‌, నటి అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది.

తెలుగురాష్ట్రాల్లో వినాయక నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించి.. రికార్డు ధ్రువపత్రాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు. 

వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. ప్రముఖ నటుడు చిరంజీవి రూ. 50 లక్షలు, సినీ నటులు అలీ రూ.3 లక్షలు, తదితరులు అందజేశారు. 

ప్రముఖ గాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నివాళులర్పించారు. ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది.

అహ్మదాబాద్‌లో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులతో సరదాగా ముచ్చటించారు.

సైమా వేడుకలో ‘అన్నపూరణి’ సినిమాకుగాను నయనతార ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో విఘ్నేశ్‌ వేదికపైకి వచ్చి ఆమె నుదుటన ముద్దు పెట్టి అభినందనలు తెలిపారు. 

ఖైరతాబాద్‌ మహా వినాయకుడి నిమజ్జనం మంగళవారం జరగనుంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు(12-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(11-12-2024)

Eenadu.net Home