చిత్రం చెప్పే విశేషాలు

(05-10-2024/1)

 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ‌నివారంశ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ముర‌ళీ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

సినీనటి కీర్తి సురేశ్‌ ఖమ్మంలో సందడి చేశారు. ఓ ప్రముఖ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 తిరుమలలో రెండోరోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు.

 తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ఆడి పాడుతూ సందడి చేశారు. 

 జి.వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌ అతిథిగా హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం విశేష క్రతువులు నిర్వహించారు. ఉదయం భక్త జనులు 'గిరి ప్రదక్షిణ' చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం మట్కా. శనివారం టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో భాగంగా వరుణ్‌ విజయవాడ వెళ్లారు. 

 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు(14-12-2024)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(13-12-2024)

Eenadu.net Home