చిత్రం చెప్పే విశేషాలు..!

(04-11-2022/1)

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని పాలపిట్ట సైక్లింగ్‌ పార్కు గేటు ఇరువైపులా ప్రహరీకి వివిధ సైజుల పాత సైకిలు రిమ్ములు, పెడల్స్‌, హ్యాండిళ్లు బిగించి అందంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ ప్రహరీ సైక్లింగ్‌కు వచ్చేవారినే కాకుండా రహదారిపై వెళ్లేవారిని సైతం ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

మేఘాలయాలోని ఉమియం సరస్సులో సైనికులకు ‘ది రైసింగ్‌ సన్‌ వాటర్‌ ఫెస్ట్‌’ పేరుతో పడవ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక గిరిజన యువత పాల్గొని వారి సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు.

Source: Eenadu

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరులోని సువర్ణముఖి నది జలకళ సంతరించుకుంది. నదిలో మట్టి కుప్పలు, వ్యర్థాలన్నీ తొలగించడంతో కొత్తగా వచ్చిన చిన్నపాటి ప్రవాహంతో నది కళకళలాడుతోంది.

Source: Eenadu

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులోని ఈ పెద్ద గుట్ట పైన మనిషి, ఏనుగు ఆకారంలో ఏర్పడిన రాళ్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

ములుగు జిల్లా మంగపేట మండలకేంద్రంలోని పుష్కరఘాట్‌ పైభాగంలో గోదావరి ఒడ్డుపై ఓ ముళ్ల పొదకు ఉన్న సాలీడు గూడు చూపరులను ఆకట్టుకుంటోంది. నాలుగు మూలలు ఆంగ్ల అక్షరాల మాదిరిగా కనిపిస్తున్నాయి.

Source: Eenadu

చోదకులు శిరస్త్రాణం ధరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. తలపై ఉండాల్సిన శిరస్త్రాణాన్ని ద్విచక్రవాహనం వెనుకాల భద్రంగా పెట్టుకొని.. చరవాణిలో మాట్లాడుతూ భూపాలపల్లి-చెల్పూర్‌ మార్గంలో వెళ్తున్న చోదకుడు. 

Source: Eenadu

ఒకప్పటి కథ పల్లెల్లో మళ్లీ పునరావృతం అవుతోంది. పల్లెలు పనులబాట పట్టాయి. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు తెలంగాణ ప్రాంతానికి గురువారం బొలెరో వాహనాల్లో వలసవెళ్లారు. 

Source: Eenadu

గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవడంతో గురువారం సూరత్‌లో భాజపా జెండాలను సిద్ధం చేస్తున్న కార్మికులు.

Source: Eenadu

సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా మారాయి. ఏడాదిగా ఇదే పరిస్థితి అని వాహనదారులు చెబుతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నట్లు వాపోతున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఇనుప గొట్టాలు, జాలీతో ఏర్పాటు చేసిన నిర్మాణంలో అంతస్తుల్లా నీటి కొంగలు ఇలా గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. సంతానోత్పత్తి అనంతరం వాటిదారిన అవి వెళ్లిపోతాయి. పక్షుల అపార్ట్‌మెంట్‌లా కనిపిస్తున్న ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home