చిత్రం చెప్పే విశేషాలు!

(30-11-2022/2)

పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప ద రైజ్‌’ డిసెంబర్‌ 8న రష్యన్‌ భాషలో విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 1న మాస్కో, 3న సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ వేయనున్నారు. దీంతో అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌ రష్యా చేరుకున్నారు.

Source: Eenadu

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయకుడు, బిగ్ బాస్ ఫేం శ్రీరామ చంద్ర

Source: Eenadu

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘RC 15’(వర్కింగ్ టైటిల్‌) న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇక్కడి అద్భుతమైన ప్రదేశాల్లో ఓ పాటను చిత్రీకరించినట్లు వెల్లడిస్తూ రామ్‌చరణ్‌ ఈ చిత్రాలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా గుండెగాం గ్రామంలో పర్యటించారు. పత్తి చేనులో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Source: Eenadu

 తమిళ నటుడు విజయ్‌ సినిమా రంగంలోకి వచ్చి 30ఏళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘అదిరింది’ సినిమాను ప్రదర్శించనున్నారు.

Source: Eenadu

తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటించారు. పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

Source: Eenadu

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నాలుగో విడత విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.684 కోట్ల నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన తెలిపారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకను జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Source: Eenadu

జొన్నరొట్టె కావాలా నాయనా..?

స్టెప్పులేసిన ‘వయ్యారి’ భామ

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

Eenadu.net Home