చిత్రం చెప్పే విశేషాలు..!

(04-12-2022/1)

సీఆర్‌డీఏ అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడది ముళ్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది.

source : eenadu

నెల రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీకురుమూర్తిస్వామి తిరునాళ్లలో యాత్రికులు తాగి పడేసిన నీటి, మద్యం సీసాలను సేకరించి కొందరు జీవనోపాధి పొందుతున్నారు. ఇవన్నీ కలిపితే చిన్నపాటి కొండలా తయారైనా ఆశ్చర్యపోనక్కరలేదు.

source : eenadu

జనగామ జిల్లాలోని పిట్టలోనిగూడెంలో 20 డేరా ఇళ్లు ఉంటాయి. సర్పంచిదీ టార్పాలిన్‌తో వేసుకున్న డేరా ఇల్లే.. కానీ ఒక్కో కుటుంబంలో పిల్లలు మాత్రం ఐదుగురు నుంచి 11 మంది వరకున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విస్మయం వ్యక్తం చేశారు.

source : eenadu

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చాక అనేక మంది కళాకారులు సందర్శిస్తూ మురిసిపోతున్నారు. బెంగాల్‌కు చెందిన దీపక్‌ఘోష్‌ అనే కళాకారుడు రామప్ప ఆలయాన్ని ప్రతిసృష్టించారు. కార్డు బోర్డుతో ఈ ఆలయాన్ని చిన్ని నమూనాలో అచ్చు గుద్దినట్టుగా తయారు చేశారు.

source : eenadu

విజయవాడ జక్కంపూడి కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి. డిసెంబర్‌ 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లన్నీ ప్రారంభించనుండటంతో అధికారులు భవనాలను సిద్ధం చేస్తున్నారు.

source : eenadu

సాధారణంగా ఒక కంద 4 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నాలుగో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ ప్రసాద్‌ తోటలో ఓ దుంప 20 కిలోల వరకు ఊరింది.

source : eenadu

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సినంత బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు.

source : eenadu

సిద్దిపేటలోని వెంకటేశ్వరాలయం, కోమటిచెరువు, చారిత్రక కమాన్‌ ప్రాంతాలు.. ఎరుపు, కాషాయ వర్ణాలతో మెరుస్తున్నాయి. భాస్కరుడు ఆయా ప్రాంతాలకు సాయంత్రం వేళ కొత్తదనాన్ని పంచుతూ పట్టణవాసులను ఆకట్టుకున్నాడు.

source : eenadu

గమనిక: ఇది ప్రయత్నించకండి

బాక్సర్‌ మీనాక్షి

ఈవీఎంలు ఇలా పుట్టుకొచ్చాయి!

Eenadu.net Home