చిత్రం చెప్పే విశేషాలు..!

(03-10-2022/1)

ఆదివారం అర్ధరాత్రి కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దాండియా నృత్యం చేస్తున్న సినీనటులు రాజశేఖర్, జీవిత.

Source: Eenadu

తెల్లారక ముందే.. తెప్పలపై జలాశయంలోకి వెళ్తారు.. వలలు వేసి చిక్కిన చేపల్ని తెచ్చుకుంటారు.. ఈ క్రమంలో గాలులతో అలలు వస్తే.. బతుకు జీవుడా అంటూ వెనుదిరుగుతారు.. ఇదీ ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో మత్స్యకారుల బతుకు చిత్రం.

Source: Eenadu

సాధారణంగా పామాయిల్‌ మొక్కలు భూమి నుంచి రెండు అడుగుల ఎత్తు పెరిగాక మొదలు భాగంలో గెలలు వేస్తాయి. కానీ.. అశ్వారావుపేటకు చెందిన కలపాల నాగయ్య అనే రైతు పొలంలోని చెట్టు పెరగలేదు. కానీ, మొదలు భాగంలోనే ఇలా గెలలు వేసింది.

Source: Eenadu

గార్లదిన్నె మండలం పెనకచర్ల జలాశయం సమీప ప్రాంతాల్లో మేత బాగా దొరుకుతుండటం వల్ల గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. విద్యుత్ కోసం ప్రతి గుడారానికి ఒక సౌరపలకం ఏర్పాటు చేసుకున్నారు.

Source: Eenadu

హనుమకొండలోని పెద్దమ్మ గడ్డ సమీపంలో అక్షర కాలనీకి వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. చిరుజల్లులకే బురద మయంగా మారుతోంది.

Source: Eenadu

ఏపీలోని ఉమ్మడి ప.గో. జిల్లా కైకలూరుకు చెందిన తేజస్విని బీటెక్‌(మెకానికల్‌), ఎంటెక్‌ పూర్తి చేశారు. టీఎస్‌ఆర్టీసీలో భారీ వాహనాలు నడిపే శిక్షణ ఇస్తున్నారని తెలియడంతో అక్కడ శిక్షణ తీసుకొని ఏకంగా బస్సు నడిపేస్తున్నారు.

Source: Eenadu

దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టారు. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. శనివారం ఒక్కరోజే 46 వేల వాహనాలు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రాకపోకలు సాగించాయి.

Source: Eenadu

2023లో గిన్నిస్‌ రికార్డు లక్ష్యంగా కోకాపేట వద్ద నిర్మాణంలో ఉన్న 23 కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను ఆదివారం హైదరాబాద్‌ సైకిల్‌ గ్రూప్‌ బాధ్యుడు రవీందర్‌ నేతృత్వంలోని పలువురు సైక్లిస్టులు సందర్శించారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

Eenadu.net Home