చిత్రం చెప్పే విశేషాలు..!
(13-01-2023/2)
సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, మెహర్ రమేశ్ సంధ్య థియేటర్‌లో సందడి చేశారు. అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
Source: Eenadu
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులంతా కుటుంబ సమేతంగా పల్లెలకు పయనమయ్యారు. దీంతో బస్టాండులన్నీ కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ చిత్రాలివి.
Source: Eenadu
మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. విజయవాడ బందర్ రోడ్డులో ఆయన కుమారుడు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఇతర కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు.
Source: Eenadu
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
Source: Eenadu
నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకల కోసం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Source: Eenadu
ప్రఖ్యాత హోమియో వైద్య నిపుణులు పావులూరి కృష్ణ చౌదరి పార్థివ దేహానికి సినీనటుడు చిరంజీవి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురువారం రాత్రి కృష్ణ చౌదరి మృతి చెందారు.
Source: Eenadu
బాలకృష్ణ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహా రెడ్డి’ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు రూ. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్ర బృందం తెలిపింది.
Source: Eenadu
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ నేడు కడప పెద్ద దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ముస్లిం సంప్రదాయంలో స్వాగతం పలికారు. అనంతరం శంకర్ దర్గాలో చాదర్ సమర్పించారు.
Source: Eenadu
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛాలు, శాలువాలకు బదులు పుస్తకాలు అందించాలని గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈవిధంగా సేకరించిన 6వేల నోట్ పుస్తకాలను పలు జిల్లాల్లో విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు.
Source: Eenadu