చిత్రం చెప్పే విశేషాలు!

(21-07-2022)

తాజాగా మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న అందాల భామ సినీశెట్టి హైదరాబాద్‌లో సందడి చేశారు. హైటెక్‌సిటీలో ‘హై లైఫ్‌ బ్రైడ్స్‌’ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇతర మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Source: Eenadu 

 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దీంతో ఒడిశాలోని ముర్మూ స్వగ్రామంలో సంబరాలు మొదలయ్యాయి.

Source: Eenadu 

తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా ముజీబుద్దీన్‌ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Source: Eenadu

దిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Source: Eenadu

‘పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ సహ వ్యవస్థాపకురాలు, సినీనటి మంచు లక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఈ మేరకు ఆమె జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతితో సమావేశమై ఎంఓయూ చేసుకున్నారు.

Source: Eenadu 

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలంకలో బాధిత ప్రజలు, రైతులను కలుసుకొనేందుకు ఆయన పడవ ప్రయాణం చేశారు.

Source: Eenadu 

పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో చెట్లను నరికి వేశారు. దీంతో అనుమతి లేకుండా చెట్లు కొట్టారంటూ ఫారెస్ట్ అధికారులు రూ.11,030 జరిమానా విధించారు.

Source: Eenadu 

 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటించారు. ఇటీవల జరిగిన అటవీశాఖ అధికారుల దాడిలో గాయపడ్డ రైతులు, మహిళలను ఆమె పరామర్శించారు.

Source: Eenadu 

చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home