చిత్రం చెప్పే విశేషాలు!

(22-07-2022) 

కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడులో బుధవారం అర్ధరాత్రి దాటాక కురిసిన భారీ వర్షానికి ఒకటో వార్డును వరద ముంచెత్తింది. ఇక్కడ 150కి పైగా ఇళ్లుంటాయి. అర్ధరాత్రి ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు జాగారం చేశారు.

#Eenadu

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో తీర్చిదిద్దిన ఆమె శిల్పం. #Eenadu


వానాకాలం ఆరంభం కావడంతో ఎక్కడ చూసిగా ప్రకృతి పచ్చగా కనిపిస్తోంది. అన్నదాతలు చేలను సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సుందర దృశ్యాల మధ్య కపోతాలు గుంపుగా విహరించడం నేత్రానందమే మరి. ఈ చూడచక్కని దృశ్యం కంది మండలం ఆరుట్ల శివారులో కనిపించింది.

#Eenadu

 వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా వరినాట్లు కనిపిస్తున్నాయి. మహిళా కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. మహ్మదాబాద్‌ శివారు పంటచేలల్లో శ్రమైక జీవన సౌందర్యం ఉట్టిపడుతున్న ఈ దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.

#Eenadu

 కరీంనగర్‌ జిల్లా రామడుగులో కాకతీయుల కాలం నాటి పురాతన కోటపై ఏపుగా పెరిగిన వృక్షం అందరినీ ఆకర్షిస్తోంది. బురుజుపై నున్న రాళ్లు కొంత మట్టి మధ్యనే పెరిగిన వేపవృక్షం మండు వేసవిని సహితం తట్టుకుంది. ప్రస్తుత వర్షాలకు పచ్చదనం పరుచుకుంది.

#Eenadu

సుదీర్ఘకాలం పాటు సింగరేణిలో విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హబీబ్‌షాఖాన్‌ తన విశ్రాంత జీవితాన్ని పక్షులకు సేవ చేయడంతో గడుపుతున్నాడు. ఊర పిచ్చుకలు, ఇతర పక్షుల కోసం గోదావరిఖని పట్టణం మార్కండేయకాలనీలోని తన ఇంటి ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

#Eenadu

ఏటీఎం మిషన్‌ తరహాలో ఉన్న ఈ పరికరం దిశ సైబర్‌ కవచ్‌. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూడు మిషన్లు కడప దిశ ఠాణాలో ఉన్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, దిశ ఠాణాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

#Eenadu


నేటి తరం యువత అభిరుచి ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతోంది. ఓ యువకుడు తలపై కొప్పులా తీర్చిదిద్దుకున్న తీరు విశాఖపట్నం ఏయూ ప్రాంగణంలో పలువురిని ఆకట్టుకుంది.

#Eenadu


తమ ప్రాంతానికి వెళ్లేందుకు విశాఖ ద్వారకా బస్‌ స్టేషన్‌కు గురువారం ఈ వృద్ధులు వచ్చారు. బస్సు ఆగిన చోట నుంచి కాంప్లెక్స్‌ వైపు వచ్చే మార్గంలో బస్సుల రాకపోకలు ఎక్కువ. దీంతో ఆర్టీసీ ఉద్యోగులే ఈ వృద్ధుల లగేజీ పట్టుకొని కాంప్లెక్స్‌ వరకూ తీసుకువెళ్లి సాయమందించారిలా.

#Eenadu


చిత్రం చెప్పే విశేషాలు!(27-11-2022/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(27/11/2022/1)

భారత రాజ్యాంగం అమలు ఎలా జరిగిందంటే...!

Eenadu.net Home