చిత్రం చెప్పే విశేషాలు! (16-08-2022/1)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అధికారులు మొట్టమొదటిసారిగా శివలింగం, నంది ప్రతిమల రాగి నాణేలను సోమవారం ఆలయ ఈవో రమాదేవి ఆవిష్కరించారు.
image:Eenadu
నార్వేలోని గుడ్‌బ్రాండ్స్ డాలెన్‌లో లాగెన్ నదిపై కూలిపోయిన వంతెన
image:Eenadu
ఐఎన్‌ఎస్ సుమేథ నౌక విధుల్లో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్ తీరంలో ఆగింది. ఈ నౌకపై నిర్వహించిన భారత స్వాతంత్ర్య దినోత్సవంలో రాయల్ ఆస్ట్రేలియా నేవీ, భారత్ నేవీ అధికారులు పాల్గొన్నారు.
image:Eenadu
భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ అధికారులకు మిఠాయిలు పంపిణీ చేస్తున్న పాకిస్థాన్ సైనికులు
image:Eenadu
మూడు రంగుల విద్యుత్ కాంతులతో సిడ్నీలోని ఒపెరా హౌస్
image:Eenadu
పంద్రాగస్టు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు భావనా దేహరియా(30)... ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించారు. సోమవారం తెల్లవారుజామున అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
image:Eenadu
తాను కదల్లేని స్థితిలో ఉన్నా.. భారతీయులందరి మనసులు కదిలించేలా ఈ చిత్రం గీశాడు దివ్యాంగ కళాకారుడు ఆయుష్ కుందాల్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలితో కుంచె పట్టి భరత మాతకు జవాన్ సెల్యూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాడు. image:Eenadu
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం నగర శివారు హెచ్చెల్సీకాలనీలోని నసనకోట ముత్యాలమ్మను త్రివర్ణ పతాకంతో నయనానందకరంగా అలంకరించారు.
image:Eenadu