చిత్రం చెప్పే విశేషాలు..!
(17-08-2022/1)
ఓవైపు గోదావరి వరద, మరోవైపు విద్యుత్తు సరఫరా నిలిపివేతతో అంధకారంలో మగ్గుతున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మురుమూరు గ్రామస్థులు మంగళవారం ప్రధాన రహదారిపై కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
Source: Eenadu
కర్నూలు జిల్లా హాల్వహర్వి మండలం మాచనూరు వద్ద కల్వర్టు వంతెన ఐదేళ్ల క్రితం కురిసిన వర్షాలకు ధ్వంసమైంది. అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలు అటు నుంచి నడిచి వెళ్లేందుకూ సాధ్యం కావడం లేదు. దీంతో వాగులోంచి రాకపోకలు సాగిస్తున్నారు.
Source: Eenadu
దిల్లీలో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
Source: Eenadu
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కోసం తూర్పుగోదావరి జడ్పీ సమావేశంలో కేటాయించిన సీటు. అనంతబాబు ఖైదీగా ఉన్నారని తెలిసినా.. ప్రొటోకాల్ ప్రకారం ముందు వరుసలో కుర్చీ వేయడం చర్చనీయాంశమైంది.
Source: Eenadu
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని లాండసాంగ్వీ గ్రామానికి వెళ్లే రహదారి అధిక వర్షానికి ఏడు అడుగుల ఎత్తులో కోతకు గురైంది. చోదకులు ప్రయాణించాలంటే జంకుతున్నారు.
Source: Eenadu
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రత్యేక వేషధారణతో తన దేశభక్తిని చాటుకున్నాడు. కోటపల్లి మండలం భావనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణతో ఆకట్టుకున్నాడు.
Source: Eenadu
వజ్రోత్సవ వేళ.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో దాదాపు 40 మంది సాధకులు జాతీయ జెండాలతో జల విన్యాసం చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా జెండాలు పట్టుకొని ఒంటి చేత్తో (బ్యాక్ స్ట్రోక్) ఈత కొట్టారు. వివిధ రకాల పిరమిడ్‌గా ఏర్పడ్డారు.
Source: Eenadu
దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధి నర్సాపూర్‌లో గీత కార్మికులు తాటి చెట్టు పైకి ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నారు. 15 మంది కార్మికులు చెట్లు ఎక్కారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.
Source: Eenadu