చిత్రం చెప్పే విశేషాలు.!

(27-07-2022/2)

పార్లమెంట్‌లో తెరాస ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

Source: Eenadu

ఎగువ కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట పురపాలిక పరిధిలోని సద్దుల చెరువు ఇలా పాల నురుగులా అలుగు పోస్తోంది. దీంతో కాలువలు నిండుగా పారుతున్నాయి.

Source: Eenadu

భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తారు. దీంతో చాదర్‌ఘాట్‌ వద్ద మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.

Source: Eenadu

ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. బౌకో పట్టణ సమీపంలో బండరాళ్లు పడుతున్న ఈ దృశ్యాన్ని కొందరు చిత్రీకరించారు.

Source: Eenadu

‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీబీపీ సైనికులు లద్దాఖ్‌లో 12వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాలను ప్రదర్శించి దేశభక్తిని చాటారు.

Source: Eenadu

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే టాటా గ్రూప్‌నకు చెందిన రతన్‌ టాటాను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సీఎంగా ఎన్నికైన ఏక్‌నాథ్‌ శిందేను రతన్‌ టాటా అభినందించారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని మూసీ నది నుంచి భారీగా వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోకాపేట అండర్‌పాస్‌ వద్ద వరద నీరు చేరింది.

Source: Eenadu

తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చించారు.

Source: Eenadu

జర్మనీలోని సాక్సన్‌ స్విట్జర్లాండ్‌ నేషనల్‌ పార్కులో కార్చిచ్చు సంభవించింది. ఎల్బే నదిలో ఉన్న నీటితో వీటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లతో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Source: Eenadu

ఉక్రెయిన్‌లో బుధవారం స్టేట్‌హుడ్‌ డే వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువరు విద్యార్థులు(క్యాడెట్లు) మిలటరీ దుస్తుల్లో హాజరయ్యారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులకు మద్దతు తెలుపుతూ ఉత్తరాలు రాశారు.

Source: Eenadu

దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్ర్తవేత్త ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ వర్ధంతి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి గతంలో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home