చిత్రం చెప్పే విశేషాలు..!

(19-08-2022/1)

నల్లబెల్లి శివారు రేగులకుంట చెరువులో కొంగలు సంధ్యా సమయంలో సందడి చేస్తున్నాయి. సాయంత్రం వేళ చెరువు వద్దకు చేరుకొని చెట్ల కొమ్మలపై వాలి చూపరులను కట్టిపడేస్తున్నాయి.

Source: Eenadu

‘నో హెల్మెట్‌ నో పెట్రోల్‌’ ఆదేశాలు నగరంలోని ఏ పెట్రోల్‌ బంకుల్లోనూ పూర్తిస్థాయిలో అమలవ్వడం లేదు. పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా.. బంకు యజమానులు పట్టించుకోకపోవడంతో ఆచరణ నీరుగారిపోతోంది.

Source: Eenadu

షేక్‌పేట దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా ఫిలింనగర్‌ రోడ్డునంబరు 78 రహదారిపై తారు, సిమెంట్‌ కుప్పలుగా పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తారు వల్ల కొందరు జారిపడుతుండగా.. కంకర సిమెంట్‌తో దుమ్ము లేచి ముందున్నది కనబడడం లేదని పలువురు వాపోతున్నారు.

Source: Eenadu

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం నేపథ్యంలో గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర ఆలయం వద్ద భక్తుల సందడి.

Source: Eenadu

దిల్లీలో గురువారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో రామ్‌నాథ్‌ సతీమణి సవితా కోవింద్‌, కుమార్తె స్వాతీ కోవింద్‌.

Source: Eenadu

చేతితో నీటిని అందుకునేలా కళకళలాడుతున్న ఈ వ్యవసాయ బావి హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలోనిది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ గ్రామంలో వ్యవసాయ బావులన్నీ ఇలా నీటితో గంగాళాలను తలపిస్తున్నాయి.

Source: Eenadu

న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ అనగానే ఆకాశహర్మ్యాలు గుర్తుకు రావడం సహజం. అలాంటి వాటిలో విభిన్నమైనది స్టైన్‌వే టవర్‌. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆకాశహర్మ్యంగా ఇది గుర్తింపు పొందింది. ఇది 435 మీటర్ల (1,428 అడుగుల) ఎత్తున్న 84 అంతస్తుల టవర్‌.

Source: Eenadu

డిజురీడూ అనేది ఆస్ట్రేలియాకు చెందిన 2500 ఏళ్ల కిందటి దేశీయ వాయిద్యం. హ్యాండ్‌పాన్‌ అనేది స్విట్జర్లాండ్‌లో హస్తకళా కళాకారులు తయారుచేసిన సంగీత పరికరం. వీటితో ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు.

Source: Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పే విశేషాలు (17- 10 -2024)

వదిలేయాల్సింది మీ కలలను కాదు

Eenadu.net Home