చిత్రం చెప్పే విశేషాలు..!
(28-07-2022/2)
పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళుతున్న తెదేపా అధినేత చంద్రబాబుకు తెలంగాణలోని పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.
Image: Eenadu
నంద్యాల జిల్లా బనగానపల్లి నుంచి అవుకు వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారింది. మోకాళ్ల లోతు గుంతల్లో ప్రయాణాలు సాగించలేక అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
Image: Eenadu
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వరదల కారణంగా విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు.
Image: Eenadu
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే సాగర్ జలాశయానికి అదనంగా నీరు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image: Eenadu
ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మిదొడ్డిలోని దేవతా మూర్తుల వద్ద పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు.
Image: Eenadu
మూసీ వరదల కారణంగా హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వంతెనపై రెండు రోజులపాటు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం నీటి ఉద్ధృతి తగ్గడంతో వంతెనపైకి కొట్టుకొచ్చిన ఇనుప జాలీలు, బండరాళ్లను తొలగించే పనిలో పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమయ్యారు.
Image: Eenadu
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన ఈయన పేరు కాశిరెడ్డి. తన కావడిలో గతంలో ఉపయోగించే బిందెలు, కడవలు కాకుండా ప్లాస్టిక్ క్యాన్లు వినియోగిస్తూ చుట్టుపక్కలి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారిలా..
Image: Eenadu
అవయవాల తరలింపు కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పటల్ వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో లక్డీకపూల్ వద్ద ఇలా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Image: Eenadu