చిత్రం చెప్పే విశేషాలు! (20/08/2022/)

చిలుక ఆహార వేటలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది శివారులోని పొద్దు తిరుగుడు చేలో వాలింది. గింజలను తింటూ ఆనందిస్తుండగా ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.

image:Eenadu

సెర్బియాలోని ప్రహోవో తీరంలో వెలుగు చూసిన రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మనీ నౌక శిథిలాలు.

image:Eenadu

హైదరాబాద్‌ నగరంలో పలు పార్కులు పచ్చదనం సంతరించుకుంటున్నాయి. ఇందిరాపార్కులోని కొలను గట్టుపై ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లతో ఆ ప్రాంతం కోనసీమను తలపిస్తోంది.

image:Eenadu

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర-బృందావన్‌లను కలుపుతూ ఏర్పాటు చేసిన 50 సీట్ల ఇంటర్‌ సిటీ రైలు బస్సు. కృష్ణాష్టమి సందర్భంగా భక్తులకు రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

image:Eenadu

ఆబాలగోపాలుడైన శ్రీకృష్ణుడంటే అందరికీ ప్రీతిపాత్రం. గోకులాష్టమి సందర్భంగా గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు పట్టణంలో ఆవాలతో శ్రీకృష్ణుడి బొమ్మ గీసి ప్రదర్శించారు.

image:Eenadu

ఇది విమానం మాత్రం కాదు. కైకలూరు- గోపవరం రోడ్డులో నివాసం ఉండే బెల్లాని రామ్మోహన్‌ తన ఇంటిపై నిర్మించిన విశ్రాంతి భవనం. ఏడేళ్ల కిందట నిర్మించిన ఈ భవనంలో పడక గది, మరుగుదొడ్డి ఉన్నాయి.

image:Eenadu

భీమవరానికి చెందిన వ్యాపారి పి.శివాజీ రాయలం రోడ్డులో తన ఇంటిపై నీటి ట్యాంకును ఇలా రొయ్య ఆకారంలో తీర్చిదిద్దారు.

image:Eenadu

చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌లో ఓ మహిళ నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరిస్తున్న రోబోటిక్‌ చేయి.

image:Eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home