చిత్రం చెప్పే విశేషాలు
(29-07-2022/2)
ఇటీవల మూసీ నది ప్రవాహం కారణంగా జలమయమైన మూసారాంబాగ్ వంతెనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అధికారులు తదితరులు పరిశీలించారు.
Source: Eenadu
ఏపీ, తెలంగాణ సరిహద్దులోని విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా భద్రాచలంలో గురువారం రాత్రి బస చేసిన ఆయన.. శుక్రవారం ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు
Source: Eenadu
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Source: Eenadu
ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ జూలో పులుల ఫొటో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని పులి నమూనాను ఆవిష్కరించారు.
Source: Eenadu
అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు ‘మనం-మన అమరావతి’ పేరుతో పాదయాత్రను ఉండవల్లి నుంచి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Source: Eenadu
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనం గ్రామంలో రూ.8కోట్లతో చేపడుతున్న నీరా ప్రాజెక్టు నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా సీసాల్లో నీరా తాగారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీ నటి, టీవీ వ్యాఖ్యాత సుమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రకాల ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Source: Eenadu
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దీంతో వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ,అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Source: Eenadu
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.
Source:Twitter
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పెంపుడు జంతువుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘పెట్ వ్యాన్’ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మోడల్స్ శునకాలను ముద్దు చేస్తూ సందడి చేశారు.
Source: Eenadu
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Source: Eenadu