చిత్రం చెప్పే విశేషాలు..!
(30-07-2022/2)
కరీంనగర్‌లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలు వీధులు జలమయం అయ్యాయి. సిరిసిల్ల ప్రధాన రహదారి రాంనగర్ వద్ద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Image: Eenadu
హైదరాబాద్ హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ‘ద బ్రైడల్ స్టోరీ’ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి సినీ నటులు ఆషిమా నర్వాల్, ఐశ్వర్య, స్రవంతి చొక్కారపు హాజరయ్యారు. మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
Image: Eenadu
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు. గదులకు చేరుకునేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లపై నీరు ప్రవహించింది.
Image: Eenadu
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొనేందుకు సరికొత్త ప్రయత్నం చేశారు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు. విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ వద్దకు తరలివచ్చారు. పర్యాటకశాఖ మంత్రి రోజా ఈ కార్యక్రమానికి హాజరై వారిని ఉత్సాహపరిచారు.
Image: Eenadu
అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ మాట తప్పారని తిరుపతిలోని గాంధీ కూడలి వద్ద తెదేపా మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు.
Image: Eenadu
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కార్ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్‌ఎంసీ డైరెక్టరేట్ ఆఫ్ ఈవీ&డీఎం విశ్వజిత్ కంపాటి కలిసి సైబరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(సీడీఆర్‌ఎఫ్)ను ప్రారంభించారు. అనంతరం సామగ్రిని సిబ్బందికి అందజేశారు.
Image: Eenadu
నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద మర్యాదపూర్వకంగా కలిశారు. జయప్రద, ఆమె కుమారుడు సిద్ధార్థ, కోడలు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Image: Eenadu
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గార్ 55 కేజీల విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కేజీలు, స్నాట్చ్‌లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
Image: Eenadu
హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లా మేరి కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో అలరిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చారు.
Image: Eenadu
కర్నూలు నగరంలోని ధర్మపేట సమీపంలో కేసీకెనాల్ గట్టుపై బడుగు జీవులు ఇలా ప్రమాకరంగా విద్యుత్ స్తంభాలను గూడుగా మార్చుకొని జీవిస్తున్నారు. పైగా స్తంభాలకు తడి బట్టలను ఆరేస్తున్నారు.
Image: Eenadu